ఉక్రెయిన్ తన సుదీర్ఘ ఆకాంక్షను నెరవేర్చుకొనే క్రమంలో మొదటి అడుగు వేసింది. ఐరోపా సమాఖ్య (ఈయూ)లో చేరాలని తహతహలాడుతున్న ఉక్రెయిన్‌కు యూరోపియన్ కమిషన్ శుక్రవారం పచ్చజెండా ఊపింది. ఆ దేశాన్ని సమాఖ్యలో చేర్చుకోవటానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు ఉక్రెయిన్‌కు ఈయూ అభ్యర్థిత్వ హోదా ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే 27 దేశాల ఈయూలో సభ్యత్వం పొందాలంటే కీవ్‌కు చాలా సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఈయూ నిబంధనలకు అనుగుణంగా ఉక్రెయిన్.. తమ దేశంలో ప్రజాసామ్య సంస్థలను బలోపేతం…