అసెంబ్లీ లో టిఆర్ఎస్ పార్టీ కి “ఆర్ ఆర్ ఆర్” సినిమా చూపెడతామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జోస్యం ఫలించబోతోంది. ట్రిపుల్ ఆర్ అంటే రాజా సింగ్, రఘునందన్, రాజేందర్ అన్నట్లని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. హుజూరాబాద్ నియోజకవర్గం లో ప్రచారం మొదలు పెట్టినప్పుడు బండి సంజయ్ ఈ మాటలన్నారు. కాషాయపు కంకణం కట్టుకుందాం కమలం పువ్వును గెలిపిద్దామని అప్పుడు పిలుపునిచ్చారు. కరెన్సీ నోట్ కు…
హుజారాబాద్ ఉప ఎన్నికలకు ఇంకా సమయం వుంది. ప్రధాన పక్షాలు దానిని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా అధికార టీఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా శ్రేణులను సిద్ధం చేస్తోంది. ఈ ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ “విశ్వసనీయత” అంశాన్ని తెరమీదకు తెచ్చింది. దీని ద్వారా ఓటర్ల మనసు గెలవాలని గులాబీ ప్లాన్. టీఆర్‌ఎస్ ప్రయోగిస్తున్న “క్రెడిబిలిటీ కార్డుకు” విరుగుడుగా బీజేపీ “ఆత్మగౌరవం” నినాదాన్ని ముందుకు తెచ్చింది. దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. నాయకులను కొనుగోలు చేయొచ్చు…