నిర్మల్ జిల్లా: రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కళ్లు నెత్తికి ఎక్కాయన్నారు బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. శుక్రవారం ఆయన నిర్మల్ జిల్లా ముదోల్‌లో పర్యటించిన ఆయన అక్కడ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో భైంసాలో ఎగిరేది కాషాయ జెండానే అన్నారు. ముదోల్ అంటేనే చదువుల తల్లి సరస్వతి దేవికి నిలయమని, తాము అధికారంలోకి వస్తే అభివృద్ది చేస్తామని హామి ఇచ్చారు. Also…
తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కమలం పార్టీగా మారాయి. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు సవాల్ విసురుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్య లు తీవ్ర దుమారం రేపుతున్నా యి.