ఇవాళ హుజురాబాద్ ప్రచారంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 200కిలో మీటర్ల దూరం నుండి హుజురాబాద్‌కు వచ్చానని… రేపు రాబోయే తెలంగాణ ఫలితాలకు హుజురాబాద్ వేదిక కాబోతుందని..ఒక్కరు కూడ తప్పు చేయవద్దని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రిగా హుజురాబాద్ లో కాలు మోపడం సంతోషంగా ఉందన్నారు. అత్యధిక మందికి ఆహారం అందించేది, ఉపాధి ఇచ్చేది వ్యవసాయ రంగమని… తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని బలోపితం చేయడం వల్లే అభివృద్ది సాధ్యం…
బీజేపీలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరిక సందర్భంగా నేతల మధ్య పొరపచ్చాలు వచ్చాయా? ఆయన చేరికను తమ ఖాతాలో వేసుకునేందుకు కొందరు ప్రయత్నించారా? ఆ ప్రచారానికి చెక్ పెట్టేలా.. హుజురాబాద్‌లో ఇంఛార్జ్‌ల నియామకం జరిగిందా? బీజేపీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? ఎవరు ఎవరికి చెక్ పెట్టారు? ఈటల చేరిక సందర్భంగా జరిగిన పరిణామాలపై చర్చ! తెలంగాణ బీజేపీలో బయటకు అంతా సవ్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నా.. అంతర్గతంగా ఆధిపత్య పోరు నడుస్తోందట. సీనియర్ల మధ్య పడటం…
ఈటల రాజేందర్‌పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. కురుక్షేత్ర యుద్ధం అని ఈటెల మాట్లాడుతున్నారని.. ఏడు సంవత్సరాలు మంత్రి పదవిలో ఉన్నప్పుడు కురుక్షేత్ర యుద్ధం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. ఆత్మగౌరవం అంటే పేద వాడు మంచిగ బ్రతకడమేనని.. మాట్లాడితే బీసీ అంటున్న ఈటెల… నీ వ్యాపార భాగస్వాముల్లో ఎంత మంది బిసిలు ఉన్నారు?అని మండిపడ్డారు. బిసి అని చెప్పుకునే హక్కు ఈటెలకు లేదని…ఈటెల రాజేందర్ పదవికి రాజీనామా చేయలేదు… బర్త్ రఫ్ చేశారని…
హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలోని శనిగరం గ్రామంలో రైతు వేదిక ప్రారంభించారు మంత్రి ఎర్రబెల్లి. ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నన్ను రానియలేదని.. దామోదర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కువగా వచ్చేవాన్ని అని పేర్కొన్నారు. కాళేశ్వరం వచ్చిన తరువాతనే నీళ్లు ఎక్కువగా వస్తున్నాయి.. నలబై ఏండ్ల నుంచి చూసిన.. ఇంత మంచి ముఖ్యమంత్రి కంటే ఎవ్వరిని చూడలేదని తెలిపారు. బయట వాళ్ళు ఎగేస్తే నీవు…
ఈటల రాజేందర్ పై మరోసారి కాంగ్రెస్ పార్టీ టిపిసిసి సెక్రెటరీ కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆస్తులను కాపాడుకోవడానికి ఈటల బీజేపీలో చేరారని… జార్జిరెడ్డి కమ్యూనిస్టు భావజాలం గల మీరు బిజెపిలో ఎలా చేరతారని ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి. ఏడున్నర సంవత్సరాల ముదురాజ్ బిడ్డలకు ఉద్యోగ కల్పన కల్పించారా? బిసి నాయకులుగా ఉన్న మీరు వారికి ఎం చేశారని నిలదీశారు. కౌశిక్ రెడ్డిని ఓడించుటకు బిసి నాయకులకు బ్యాంక్ లోన్ కల్పిస్తామన్న మీరు ఎంత మందికి కల్పించారని……
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 14న బిజేపి తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే పార్టీ మారినప్పటి నుంచి.. ఈటల పై టీఆర్ఎస్ నాయకులు మాటల దాడి చేస్తున్నారు. తాజాగా ఈటల రాజేందర్ పై మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. ఢిల్లిలో ఈటల రాజేందర్ తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడని.. ఫ్లైట్ లో వెళ్లి బీజేపీలో చేరిన ఈటలకు బీజేపీ అధ్యక్షులు కూడా టైం ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. హుజురాబాద్ ఈరోజు గుడ్డి…
ఢిల్లీలో బిజేపి జాతీయ అధ్యక్షుడు జె.పి నడ్డాతో ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బండి సంజయ్, రాష్ట్ర బిజేపి ఇంచార్జ్ తరుణ్ చుగ్, మాజీ ఎంపి వివేక్ వేంకటేస్వామి, ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా జె.పి నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. బిజేపిలో చేరాలన్న ఈటల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని… తెలంగాణలో బిజేపి మరింత చురుకైన పాత్ర పోషిం చేందుకు సమాయత్తం కావాలని రాష్ట్ర నాయకులకు నడ్డా సూచించారు. ఉద్యమ నాయకులతో పార్టీ…
బిజేపి జాతీయ అధ్యక్షుడు జె.పి నడ్డా నివాసంలో ఈ రోజు కీలక సమావేశం జరుగనుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు జె.పి. నడ్డాతో ఈటల రాజేందర్ భేటీ కానున్నారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, ఇటీవల జరిగిన పరిణామాలను నడ్డాకు వివరించనున్నారు ఈటల రాజేందర్. ఇప్పటికే బిజేపిలో చేరేందుకు రంగం సిద్దం కాగా.. బిజేపిలో తాను నిర్వహించాల్సిన పాత్రపై చర్చిం చనున్నారు. తెలంగాణలో అన్ని సామాజిక వర్గాలకు రాష్ట్ర బిజేపిలో తగిన ప్రాధాన్యత, ప్రాతినిధ్యం కల్పించే అంశంపై…