కరోనా సమయంలో దేశంలో వంటనూనెల ధరలకు రెక్కలొచ్చిన సంగతి తెలిసిందే. భారీ స్థాయిలో ధరలు పెరిగాయి. నిత్యవసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్యులు అనేక ఇబ్బందులు పడ్డారు. అయితే రెండు నెలల క్రితం కొంతమేర ఆ ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, వంటనూనెల తయారీలో వినియోగించే పామాయిల్ గింజలు, సోయాబీన్స్ వంటి వాటిని బయోప్యూయల్‌గా వినియోగించడానికి ఎక్కవ ఆసక్తి చూపుతుండటంతో అంతర్జాతీయంగా నూనెల ధరలు పెరిగాయి. అయితే, పామాయిల్, సోయాబీన్ ఆయిల్ వంటి…