పూణేలో జరిగిన రోడ్డు ప్రమాదం దేశంలో చర్చనీయాంశమైంది. ఇక్కడ వేగంగా వస్తున్న లగ్జరీ కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. కారును 17 ఏళ్ల మైనర్ మద్యం మత్తులో నడిపాడు. కాగా ఈ కేసునులో ముఖ్యంగా ప్రమాదానికి కారణమైన బాలుడి చేత వ్యాసం రాయించాలని జువైనల్ జస్టిస్ బోర్డు ఆదేశాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.