Iran: ఇరాన్‌కి చెందిన రివల్యూషనరీ గార్డ్స్ కార్ఫ్స్(IRGC) ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఎస్మాయిల్ ఖానీ శుక్రవారం బీరుట్‌లో కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. శుక్రవారం బీరూట్‌పై జరిగిన ఇజ్రాయిల్ వైమానిక దాడుల తర్వాత నుంచి మిస్సయినట్లు నివేదికలు వెలువడ్డాయి. ఇరాన్ మీడియా ఇతడి ఆచూకీ గురించి మౌనంగా ఉండగా.. టర్కీష్, ఇజ్రాయిల్ మీడియాలు మాత్రం ఖానీ చనిపోయి ఉండొచ్చని పేర్కొన్నాయి.