KCR: ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ను మంత్రులు కలవనున్నారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ కేసీఆర్‌ను మేడారం మహా జాతరకు ఆహ్వానించనున్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరను ఘనంగా నిర్వహించాలనే లక్ష్యంతో విపక్ష నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులను స్వయంగా కలిసి ఆహ్వానాలు అందజేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ భేటీ జరగనుంది.
KCR: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతోంది. ఈ ఎన్నికలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా రంగంలోకి దిగనున్నారు. రేపు ఎర్రవల్లి ఫార్మ్‌హౌస్‌లో జూబ్లీహిల్స్ ఇన్‌ఛార్జ్‌లతో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వ్యూహంపై కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, పార్టీ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వనున్నారు కేసీఆర్. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయానికి తగిన వ్యూహం రూపకల్పనపై చర్చలు జరగనున్నాయి.