Earthquake: హిమాలయ దేశం నేపాల్ వరస భూకంపాలతో వణికిపోతోంది. ఆదివారం రెండుసార్లు భూకంపాలు వచ్చాయి. తాజాగా రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(ఎన్‌సీఎస్) వెల్లడించింది. ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ భూకంపం వచ్చింది. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది.