Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగులపై అధికారులు చర్యలు చేపట్టారు. క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తూ ఉద్యోగ నియమాలను ఉల్లంఘించినట్లు విజిలెన్స్ అధికారుల నివేదికలో పేర్కొనడంతో, వారిపై టీటీడీ ఈవో సస్పెన్షన్ వేటు వేశారు.