ఈ ఏడాది మిర్చి రైతులకు కలిసివచ్చింది. దీంతో రైతులకు మద్దతు ధరకు మించిన ధరలు లభిస్తున్నాయి. అంతేకాకుండా మిర్చి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తాజాగా వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్లో క్వింటాల్ దేశీయ రకం మిర్చి ధర ఏకంగా రూ.44వేలు పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన రైతు నాగేశ్వరరావు తీసుకువచ్చిన మిర్చిని జితిన్ ట్రేడింగ్ కంపెనీ క్వింటాల్‌కు రూ. 44 వేలు చెల్లించి కొనుగోలు చేసింది. కొద్ది రోజుల…
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో చోటు చేసుకున్న మిర్చి రైతుల ఆందోళనలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్షా నిర్వహించారు. హైద్రాబాద్ నుంచి జిల్లా కలెక్టర్ గోపి, మార్కెట్ చైర్మన్ దిడ్డి భాగ్యలక్ష్మీ కుమార స్వామి, మార్కెట్ కార్యదర్శి, వరంగల్ ఛాంబర్ ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. రైతులకు నష్టం జరుగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు అండగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉంటుందన్నారు. రైతులు ఆందోళన చెందొద్దని పిలుపునిచ్చారు. రైతులను ఎవరు మోసం చేసిన…
వరంగల్ రైతులు కన్నెర్ర చేశారు. వ్యాపారుల మోసంపై ఆగ్రహం వ్యక్తం చేవారు. దీంతో ఏనుమాముల మార్కెట్లో ఉద్రిక్తత నెలకొంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఏనుమాముల మార్కెట్లో ఉదయం మిర్చి భారీగా వచ్చింది. దీంతో వ్యాపారులు తేజ మిర్చికి రూ.17,200గా ధర నిర్ణయించారు. అనంతరం రూ.14 వేలలోపు ధరలు నిర్ణయిస్తూ కొనుగోళ్లకు దిగారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు మిర్చి యార్డు కార్యాలయంలోకి దూసుకెళ్లారు. ఒక కాంటను ధ్వంసం చేశారు. దీంతో అధికారులు ప్రాధేయపడగా..…