ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్ ఓటమి ఇంగ్లండ్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు టెస్టులకు కాకుండా టీ20లకు ప్రాధాన్యం ఇస్తున్నారని పలువురు మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు దూరం కావాలని పలువురు ఇంగ్లండ్ ఆటగాళ్లు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఐపీఎల్ మెగా వేలానికి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాడు. ఈ ఏడాది ఐపీఎల్ అరంగేట్రం చేయాలని అతడు భావించినా యాషెస్ సిరీస్ ఓటమి కారణంగా తన జాతీయ జట్టుకు…