CM Chandrababu : రాష్ట్రంలో ఎనర్జీ ఎఫిషియన్సీ కార్యక్రమాలపై ఆ సంస్థ ప్రతినిధులు, అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష చేశారు. రాష్ట్రంలోని వివిధ గ్రామ పంచాయితీల్లో వీధి దీపాల నిర్వహణకు రూ.100 కోట్లు, పట్టణ ప్రాంతాలకు రూ.50 కోట్లను విడుదల చేయాలని సీఎం ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఇంధన వాడాకాన్ని తగ్గించేందుకు నూరు శాతం ఎల్ఈడి దీపాలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గత ప్రభుత్వం గ్రామ పంచాయితీలను పూర్తిగా నిర్వీర్యం చేయడంతో…