దేశీయ స్టాక్ మార్కెట్ వారం ముగింపులో నష్టాలతో క్లోజ్ అయింది. ఆర్బీఐ పాలసీ ప్రకటనకు ముందే సూచీల్లో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఇన్వెస్టర్లు అప్రమత్తతతో సూచీల్లో లాభ, నష్టాలతో ఊగిసలాట సాగింది.
దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాలతో ముగిసింది. అంతర్జాయతీయంగా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. ఆ ప్రభావం మన మార్కెట్‌పై కూడా పడింది. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు.. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి.