ఉపాధి హామీ పథకం పనుల కోసం 176.35 కోట్ల రూపాయల నిధుల విడుదలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది.. 2025-26 ఏడాదిలో తొలి విడతగా మంజూరు చేసిన కేంద్ర నిధులను.. ఉపాధి హామీ పథకం పనుల కోసం విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. నిబంధనల మేరకు నిధులు వినియోగానికి చర్యలు తీసుకోవాలని ఏపీ పంచాయతీరాజ్ డైరెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం..
Telangana: పంచాయతీరాజ్ శాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపులు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బిల్లుల క్లియరెన్స్ ప్రక్రియ దశలవారీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో గురువారం తొలి దశలో ఆర్థిక శాఖ ద్వారా రూ.446 కోట్లను విడుదల చేశారు. ఈ మొత్తంలో నుంచి ఉపాధి హామీ పథకానికి సంబంధించిన బిల్లులకు రూ.300 కోట్లను, పారిశుద్ధ్య కార్మికుల వేతనాల కోసం రూ.146 కోట్లను విడుదల చేశారు. ఉపాధి హామీ పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు ప్రారంభమవడంతో గ్రామీణ…