కొత్త పీఆర్సీపై ఏపీ ప్రభుత్వం సోమవారం రాత్రి జారీ చేసిన ఉత్తర్వులు చూసి ఉద్యోగులు షాకవుతున్నారు. హెచ్ఆర్ఏలో సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఎదురుచూసిన ఉద్యోగులకు షాకిస్తూ… ప్రభుత్వం హెచ్ఆర్ఏలో కోత విధించింది. సచివాలయం, హెచ్‌వోడీ ఉద్యోగుల హెచ్ఆర్ఏను 30 శాతం నుంచి 16 శాతానికి తగ్గించింది. ఇప్పటివరకు జిల్లా కేంద్రాలు, నగరపాలక సంస్థల్లో 20 శాతం, పురపాలిక సంఘాలు, 50వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో 14.5 శాతం, మిగతా ప్రాంతాల్లో 12 శాతం ఇస్తున్నారు. కొత్త విధానంలో…