Bomb Threat In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి స్కూల్స్ కు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతుంది. పశ్చిమ విహార్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, మయూర్ విహార్‌లోని సల్వాన్ పబ్లిక్ స్కూల్, కేంబ్రిడ్జ్ పాఠశాల సహా పలు విద్యాసంస్థలకు ఈ రోజు (డిసెంబర్ 13) తెల్లవారుజామున బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మధ్యాహ్నం రెండు ఆస్పత్రులకు ఈమెయిల్ ద్వారా బెదిరింపులు రాగా.. తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టారు.