మనషులు, జంతువుల మధ్య బంధం గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈ అనుబంధం చాలా గొప్పది, విడదీయలేనిది. ఆ మూగ జీవాలు చూపించే ప్రేమ అమూల్యం. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. చనిపోయిన తన మావటిని కడసారి చూసేందుకు గజరాజు తరలివచ్చిన దృశ్యాలను ఆ వీడియోలో చూడొచ్చు. విగతజీవుడిలా పడివున్న ఆ మావటిని పిలుస్తున్నట్టుగా తొండం పైకెత్తి పలుమార్లు ఆ ఏనుగు ప్రదర్శించిన హావభావాలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి.ఆ మావటి కుటుంబ…