Mohanlal : ఆ కేసులో హీరో మోహన్ లాల్ కు ఊరట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్ నివాసంపై 2011 లో ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసినప్పుడు ఏనుగు దంతాలతో తయారు చేసిన కొన్ని వస్తువులు బయటపడ్డాయి. దీంతో కేరళ అటవీ మరియు వన్యప్రాణి విభాగం అటవీ చట్టం కింద మోహన్‌లాల్‌పై కేసును నమోదు చేసింది. ఆ తర్వాత 2019లో, ఎర్నాకులంలోని మెక్కప్పల్ ఫారెస్ట్ స్టేషన్ కూడా మోహన్‌లాల్ పై కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఈ కేస్ పెరంబూర్ మేజిస్ట్రేట్ కోర్టులో పెండింగ్‌లో ఉంది. అయితే ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ మోహన్‌లాల్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు వచ్చే ఆరు నెలల పాటు మోహన్ లాల్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.దీంతో పాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరు తమను అభియోగాల నుంచి విముక్తి చేయాలని సమర్పించిన పిటిషన్లను విచారణకు అంగీకరించింది.దీనితో ఏనుగు దంతాలు అక్రమ సేకరణ కేసులో మోహన్ లాల్‌కు కాస్త ఊరట లభించింది.
మోహన్ లాల్ సినిమాలతో పాటుగా వ్యాపార రంగంలో కూడా బాగానే రాణిస్తున్నారు. ఫిషింగ్, బోటింగ్, రియల్ ఎస్టేట్ మరియు బంగారం వ్యాపారం, దుబాయ్‌లో రియల్ ఎస్టేట్, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్స్‌లో కూడా ఆయన పెట్టుబడులు కూడా పెట్టారు.దీనితో మోహన్ లాల్ పై పలు సార్లు ఐటీ దాడులు కూడా జరిగాయి.అయితే కొన్ని నెలల క్రితం ఒక కేసు విషయంలో మోహన్‌లాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులను జారీ చేసింది. కేరళకు చెందిన మోసగాడు మోన్సన్ మవున్‌కల్‌తో సంబంధం ఉన్నాయంటూ ఈడీ ఆయనకు నోటీసులను ఇచ్చింది. మోహన్ లాల్ ను విచారణకు కూడా పిలిచారు. మోన్సన్ మావుంకల్ తన వద్ద పురాతన వస్తువులు ఉన్నాయని నమ్మించి పలువురి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. మనీలాండరింగ్ కేసులో మోన్సన్ మావుంకల్ను ఈడీ అరెస్ట్ చేసింది. అతడిని విచారించగా మోహన్‌లాల్‌తో సంబంధాలు ఉన్నట్లుగా వారికీ తెలిసింది.దీంతో మోహన్‌లాల్‌కు నోటీసులిచ్చి విచారణకు హాజరుకావాలని అయితే సూచించారు.
Also Read
- Big Rain Alert: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన..
- India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
- WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
- Sachin Tendulkar: 49 ఏళ్ల తర్వాత కూడా ఇది నాతోనే ఉంది.. చిన్ననాటి బ్యాట్‌తో క్రికెట్ గాడ్..!
తాజావార్తలు
-
Big Rain Alert: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన..
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
Kove 650RR: 650cc స్పోర్ట్స్ బైక్‌లో ఫ్రంట్, రియర్ కెమెరాలు.. 108.7hp పవర్‌తో Kove 650RR ఎంట్రీ
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
ట్రెండింగ్
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!
-
Sachin Tendulkar: 49 ఏళ్ల తర్వాత కూడా ఇది నాతోనే ఉంది.. చిన్ననాటి బ్యాట్‌తో క్రికెట్ గాడ్..!
-
Virat Kohli: అప్పుడు 18, ఇప్పుడు 21.5.. విరాట్ కోహ్లీ కెరీర్లోనే చెత్త వన్డే సిరీస్!
-
India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
-
Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?