Anagani Satyaprasad : మాజీ సీఎం వైఎస్ జగన్‌ఫై మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శలు గుప్పించారు. ఇవాళ మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. తన పాలనలో రాష్ర్ట విద్యుత్ రంగంపై దాదాపు లక్షా 30 వేల కోట్ల రూపాయల భారాన్ని మోపిన జగన్ ఇప్పుడు చిలకపలుకులు పలుకుతున్నాడని ఆయన మండిపడ్డారు. యూనిట్ కు ఐదు రూపాయలకు దొరికే విద్యుత్ కు బదులు 8 నుండి 14 రూపాయల వరకు కొనుగోలు చేసి ప్రజలపైన జగన్ రెడ్డి మోయలేని భారాన్ని మోపాడని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. సోలార్, విండ్ ఎనర్జీ పీపీఎలను రద్దు చేసి రాష్ర్టానికి 10 వేల మెగా వాట్ల పునారుత్పాదక విద్యుత్తును జగన్ అందుబాటులో లేకుండా చేశాడన్నారు మంత్రి అనగాని.
Civil Supply Inspections : బేతంచెర్ల గోదాములో సివిల్ సప్లై తనిఖీలు..
2022 నుండి 2024 వరకు రెండేళ్ల కాలానికి రూ. 17 వేల కోట్ల ట్రూ అప్ ఛార్జీలను పెంచాలని అనాడే జగన్ సర్కార్ ఆమోదించిందన్నారు. ఆ ట్రూ అప్ ఛార్జీలనే రెండేళ్ల పాటు పెంచకుండా ప్రస్తుతం డిసెంబర్ నుండి అమలు చేయాలంటూ ఈఆర్సీ ఉత్తర్వులు ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. తాను పెంచాలని సూచించిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా తానే పోరాడం చేయడం పిచ్చి తుగ్లక్ జగన్ కు మాత్రమే చెల్లిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు.
WHO Chief: బాంబు దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన డబ్ల్యూహెచ్‌వో అధ్యక్షుడు