ఏపీలో విద్యుత్ బకాయిలు చెల్లించాల్సిందిగా ఉద్యోగులకు జీఏడీ నోటీసులు ఇచ్చారు. ఉచిత వసతి సౌకర్యం పొందుతున్న ఉద్యోగులు అదనంగా వినియోగించిన కరెంట్ ఛార్జీలను చెల్లించాలని జీఏడీ లేఖ రాసింది. ఆ లేఖలో.. సెక్రటేరీయేట్, హెచ్ఓడీల ఉద్యోగులకు కల్పించిన ఉచిత వసతి భవనాల్లో పరిమితికి మించి విద్యుత్ వాడుకున్నారని జీఏడీ ప్రస్తావించింది. రెయిన్ ట్రీ పార్క్, చిల్లపల్లి, నవులూరు, ఎమరాల్డ్ పార్క్, ఉండవల్లి, గొల్లపూడి వద్ద ఉద్యోగులకు కేటాయించిన అపార్టుమెంట్లలో అదనంగా విద్యుత్ వినియోగించుకున్నారని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలకు సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉందని.. న్యాయస్థానం తీర్పు ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర విద్యుత్, పునరుత్పాదక శక్తి శాఖ మంత్రి ఆర్.కే సింగ్ వెల్లడించారు.
Supreme Court: ఏదైనా ఒక ఇంటిని కానీ, ఇతర భవనాలను అమ్ముతున్న సమయంలో పాత విద్యుత్ బిల్లును విద్యుత్ బిల్లులను చెల్లించకపోవడం చూస్తుంటాం. ఇది కొత్తగా వాటిని కొనుగోలు చేసిన యజమానులపై పడుతుంది. అయితే వారు వాడిన కరెంట్ కు మేం ఎలా బిల్లు కడుతాం అనే ప్రశ్న ఇటువంటి సందర్భాల్లో ఉద్భవిస్తుంటుంది. ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది.