గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ కస్టమర్లలో ఎలక్ట్రిక్ కార్ల (EV) డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో.. ప్రముఖ కార్ల తయారీ సంస్థ JSW MG మోటార్ ఇండియా.. కొత్త ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధం అవుతుంది. 2025లో ఈ కారు విడుదల కానుంది. ఈ కారు లాంచ్‌కు సంబంధించి.. కంపెనీ సమాచారం ఇచ్చింది. 2025 జనవరిలో ఇండియాలో MG సైబర్‌స్టర్‌ను ప్రారంభించనుంది.