Home
Elections
Elections News
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
అక్కడ టీడీపీ నాయకులు అంతర్గతంగా వైసీపీకి సహకరిస్తూ టీసీపీ లీడర్స్‌గా మారిపోయారా? మున్సిపాలిటీ చేజారిపోవడానికి అదే ప్రధాన కారణమా? రాజకీయ ప్రత్యర్థికి తెర వెనక సహకారమే నిజమైతే… అందుకు దారి తీసిన పరిస్థితులేంటి? అక్కడ తెర మీదికి వచ్చిన కులాల లెక్కలేంటి? తెలుగుదేశం అధిష్టానం దగ్గర ఎమ్మెల్యేని బద్నాం చేయడానికి కొందరు గేమ్ ఆడి గెలిచారా? ఎక్కడుందా పరిస్థితి? ఏంటా స్టోరీ? ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో రెండు చోట్ల మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. సూళ్లూరుపేట… -
Karnataka SIR: కర్ణాటకలో SIR పూర్తి.. కోటి మంది పేర్లు తొలగింపు..
Karnataka SIR: కర్ణాటకలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (Special Intensive Revision – SIR) అనంతరం తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. SIRపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సమయంలో కర్ణాటకలో పూర్తైంది. ఈ ప్రక్రియలో 1.08 కోట్లకు పైగా ఓటర్ల వివరాలను జాబితా నుంచి తొలగించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 5.54 కోట్ల నుంచి 4.54 కోట్లకు తగ్గింది. ఇందులో 2,25,40,493 మంది పురుష… -
Election Commission: 5 రాష్ట్రాల ఎన్నికల ముందు ఈసీ కీలక ఆదేశాలు.!
Election Commission: వచ్చే ఏడాది 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో అధికారుల బదిలీలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కఠిన ఆదేశాలు జారీ చేసింది. గత నాలుగేళ్లలో ఒకే జిల్లాలో మూడేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పనిచేసిన అధికారుల్ని బదిలీ చేయాలని ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఈసీ ఆదేశించింది. ఎన్నికల నిర్వహణలో నిష్పాక్షికత, పారదర్శకతను కాపాడటమే… -
Madhya Pradesh: నర్మదా నది తీరంలో వేలాది ఓటర్ ఐడీ కార్డులు.. అసలేం జరిగింది?
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని నర్మదా నది తీరంలో వేలాది ఓటర్ ఐడీ కార్డులు లభించడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఖర్గోన్ జిల్లా పరిధిలోని మండ్లేశ్వర్ ఘాట్ వద్ద ఈ ఓటర్ కార్డులు కుప్పలుగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వీటిలో అత్యధిక కార్డులు ఇండోర్‌లోని 'రౌ' అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఓటర్లవిగా తెలుస్తోంది. నది వద్ద ఓటర్ కార్డులు అలా చెల్లాచెదురుగా పడి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే స్పందించిన పోలీసులు,… -
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
Off The Record: అంతన్నారింతన్నారు. మీకెందుకు మేం చూసుకుంటామంటూ ముందుకు తోసేశారు. ఎన్నికల ఖర్చులు కావాల్నా..? ఓస్ అదెంత పని, ఇట్టా.. నామినేషన్ వేసి బయటికి రాగానే.. అట్టా మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. టింగ్ టింగ్ మంటూ ఫోన్లో మెసేజ్‌ల మోత మోగిపోతుందని బిల్డప్‌లు ఇచ్చారు. తీరా సీన్లోకి వచ్చాక అక్కడి వైసీపీ ఇన్ఛార్జ్లు పూర్తిగా ముఖం చాటేశారట. ఆర్థిక భారం మోయలేక విపక్ష అభ్యర్థులు సతమతం అవుతోంది ఎక్కడ? ఎందుకలా? -
DGP Harish Kumar Gupta: “హింసకు పాల్పడితే ఉపేక్షించేది లేదు”.. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై డీజీపీ హెచ్చరిక
AP DGP Harish Kumar Gupta: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికల్లో అభ్యర్థులకు, ఓటర్లకు పూర్తి రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎనిమిది జిల్లాల్లో ఎన్నికలకు సంబంధించి 14 ఘటనలు నమోదయ్యాయని వెల్లడించారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని, ఇప్పటికే 17 మంది నిందితులను గుర్తించినట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం నామినేషన్ కేంద్రాల… -
Gopireddy Srinivasa Reddy: వైసీపీ సంచలన నిర్ణయం.. నర్సరావుపేటలో ఎన్నికలు బహిష్కరించిన వైసీపీ
YSRCP Boycotts MPTC, ZPTC Elections in Narasaraopet: తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్సీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. నర్సరావుపేటలో ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ప్రకటన చేశారు. నర్సరావుపేటలో నామినేషన్ల ఘట్టంపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రక్షణ కల్పిస్తామని పోలీసులు మాట తప్పారని ఆరోపించారు. మూడు రోజులు ఎదురుచూసినా నిరాశే మిగిలిందని పేర్కొన్నారు. -
AP Election Commission: నామినేషన్లపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు.. అభ్యర్థులకు మరో అవకాశం
AP State Election Commission: ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల (మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుటున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం (AP SEC) కీలక ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్లు వేయడానికి అభ్యర్థులకు అడ్డంకులు ఎదురయ్యాయని ఫిర్యాదులు వచ్చిన చోట మరో అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. నామినేషన్లు వేయలేకపోయిన అభ్యర్థులతో ఈరోజు(శుక్రవారం) సాయంత్రం… -
AP High Court: నామినేషన్ల గడువు పొడిగించాలి.. హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ఆర్సీపీ..
AP High Court: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తీవ్ర వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. పార్టీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు హైకోర్టు అనుమతించింది. తన పిటిషన్లో వైసీపీ ప్రధానంగా పలు అంశాలను పేర్కొంది. తమ పార్టీ అభ్యర్థులను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని, గృహనిర్బంధం చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. వెంటనే అభ్యర్థులను విడుదల చేసి, వారు నామినేషన్లు వేసేందుకు తగిన భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేసింది. -
Bhumana Karunakar Reddy: ఎక్కడికక్కడ నామినేషన్లు అడ్డుకుంటున్నారు.. బీహార్‌లో కూడా ఇంత నియంత పాలన సాగలేదు..
Bhumana Karunakar Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మహిళా అభ్యర్థుల నామినేషన్లు లాక్కొని దుశ్శాసన పర్వం కొనసాగించారని ఆరోపించారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న సంఘటనలు ప్రతిచోటా జరుగుతున్నాయన్నారు. బీహార్‌లో కూడా ఇంత నియంత పాలన సాగలేదని.. చంద్రబాబు ఇక పోటీ చేసి గెలిచే అవకాశం లేదన్నారు. నామినేషన్లు వరకు రాకుండా…
తాజావార్తలు
-
ASRB Recruitment 2026: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 1,393 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు రెడీ.. మంచి జీతం
-
Nikhil Chaudhary: భారత్‌లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
Rishabh Pant : నాకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు.. ఈసారి దొరకలేదు.. పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Gold Loan Recovery: గోల్డ్ లోన్ తీసుకున్న వారికి షాక్.. గండం ముంచుకొస్తోంది!
-
Deputy CM Pawan Kalyan: రామాంజులు మృతిపై పవన్ ఆరా.. నాగులగుట్టపల్లి ఘటనపై కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!
-
Jacob Duffy: బ్యాట్‌తో కాదు.. బంతితో డబుల్ సెంచరీ.. 22 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..!
-
Global Peace Honors: ‘గ్లోబల్ పీస్ హానర్స్’లో తారల సందడి.. సచిన్‌కు ప్రత్యేక గౌరవం..!
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!