రాజకీయ నాయకుల ప్రమేయంతో నగర శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ముజ్రా పార్టీ సంచలనానికి కారణమైంది. రాచకొండ పోలీసుల సకాలంలో జోక్యంతో ఈ పార్టీని భగ్నం చేశారు.
ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతుంది. 35 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా ముగ్గురు ప్రధాన అభ్యర్థులు మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఎన్నికల ప్రచారాలకు ఈరోజు సాయంత్రంతో తెరపడడంతో ఓటర్లను ఆకట్టుకోవడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా.. ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.