పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. పెన్షన్ వచ్చిందని వృద్ధురాలిని నమ్మించి మెడలో ఉన్న మూడు తులాల పుస్తెలతాడు చోరీ చేశాడు ఓ అగంతకుడు. మాయ మాటలు చెప్పి రూ. 4,000 పెన్షన్ మంజూరు అయ్యిందని ఫొటో దించాలని నమ్మబలికి దొంగతనానికి పాల్పడ్డాడు. వృద్ధురాలితో మాట్లాడిన దృశ్యాలు సీసీ ఫుటేజిలో రికార్డు అయ్యాయి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలు శంకరమ్మ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. Also Read:Hamas:…
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదుర్ మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. బంగారం కోసం వృద్ధ మహిళను చేద బావిలో తోసేశారు గుర్తుతెలియని దుండగులు. ఈరగని రాధమ్మ (75) అనే వృద్ధ మహిళ ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ గుర్తు తెలియని దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. వృద్ధ మహిళ మెడలో ఉన్న బంగారు చైన్ ను లాగే ప్రయత్నం చేసిన దుండగులు.. మెడలో ఉన్న చైన్.. ఆ వృద్దురాలు వదలకపోవడంతో తల మీద గాయపరిచి…
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. ఓ వృద్ధురాలిని ముగ్గురు వ్యక్తులు తాళ్లతో కట్టేసి కొట్టారు. ఆమెను కులం పేరుతో దూషించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వృద్ధురాలిని కొట్టిన ఘటనపై ఖర్గోన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓ వృద్ధురాలిని చేతులు కట్టేసి ముగ్గురు వ్యక్తులు ఆమెపై విచక్షణా రహితంగా దాడికిపాల్పడ్డారు. హీరాపూర్‌కు చెందిన గిరిజన మహిళకు ఓ కుమారుడు ఉన్నాడు. అతడు పొట్టకూటికోసం…