మహబూబాబాద్ జిల్లా నెల్లికుదుర్ మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. బంగారం కోసం వృద్ధ మహిళను చేద బావిలో తోసేశారు గుర్తుతెలియని దుండగులు. ఈరగని రాధమ్మ (75) అనే వృద్ధ మహిళ ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ గుర్తు తెలియని దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. వృద్ధ మహిళ మెడలో ఉన్న బంగారు చైన్ ను లాగే ప్రయత్నం చేసిన దుండగులు.. మెడలో ఉన్న చైన్.. ఆ వృద్దురాలు వదలకపోవడంతో తల మీద గాయపరిచి ఇంటిముందే ఉన్న చేదబావిలో తోసేశారు గుర్తుతెలియని దుండగులు. మృతి చెందిన కూడా బంగారు చైన్ ను వదలని మృతురాలు రాధమ్మ. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.