ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నగదును కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో ఏడాదికి మూడు సార్లు జమ చేస్తుంది. ప్రతి రైతుకు రూ.2వేల చొప్పున ఏడాదికి మూడు సార్లు రూ.6వేల నగదును కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అయితే ఈ పథకం అమలులో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా గతంలో కేవైసీ చేసుకున్న ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ–కేవైసీ పూర్తి చేసిన వారి ఖాతాల్లోఏ…