సంగారెడ్డి (మం) ఫసల్ వాదీ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటి బయట అడుకుంటుండగా చాక్లెట్ కొనిస్తామని చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావంతో చిన్నారి కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. చిన్నారిని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీసీ కెమెరాలో చిన్నారిని తీసుకువెళ్లే విజువల్స్ రికార్డు అయ్యాయి.