ఈద్-ఉల్-అఝా(బక్రీద్) పర్వదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముస్లి సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ త్యాగం, అంకితభావం, అల్లాహ్‌పై అచంచల విశ్వాసానికి ప్రతీక అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. ఈద్-ఉల్-అఝా పండుగ మనం కలిసి జీవించడానికి, సామాజిక సామరస్యాన్ని కాపాడుకోవడానికి ప్రేరేపిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం సాయంత్రం ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా, ఈ పండుగ కరుణ, ఐక్యత, శాంతి స్ఫూర్తిని వ్యాప్తి చేయాలని ప్రధాని మోడీ ప్రార్థించారు.