Droupadi Murmu: ప్రపంచ వాణిజ్యంలో ఎదురవుతున్న సవాళ్లను కొత్త అవకాశాలుగా మలచుకోవడానికి భారతదేశం తనకున్న అసాధారణ సామర్థ్యాలను వినియోగించుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. తాజాగా జరిగిన ఇంజినీరింగ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (EEPC) ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగంగా ఆమె ప్రసంగించారు. గత ఏడు దశాబ్దాల్లో భారతదేశ ఇంజినీరింగ్ ఎగుమతుల గమ్యస్థానాలు గణనీయంగా మారాయని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘నేషన్ ఫస్ట్’ (Nation First) అనే స్ఫూర్తితో ఈ మార్పును కొనసాగిస్తూ, భారతదేశ ఆర్థిక…