"ఈ సాలా కప్ నమ్దే" నినాదం గురించి డివిలియర్స్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఏబీ డివిలియర్స్ 2011 నుంచి 2021 వరకు ఆర్సీబీ తరపున 11 సీజన్లలో ఆడాడు. అయితే ఇటీవల విరాట్ కోహ్లీ నుండి ఒక ప్రత్యేక సందేశం అందుకున్నట్లు డివిలియర్స్ చెప్పారు. కోహ్లీ తనకు "ఈ సాలా కప్ నమ్దే" అనే పదాన్ని ఉపయోగించవద్దని కోరినట్లు ఏబీ డివిలియర్స్ వెల్లడించారు.