విదేశాల్లో ఉన్నత చదువులంటే విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపుతారు. పైగా పేరున్న యూనివర్సిటీలు, విద్యాసంస్థలు అయితే ఇంకా గర్వంగా ఫీలవుతారు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లల్లో విదేశాలకు వెళ్లి చదువుకోవాలంటే భయపడిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఇపుడు ఆ భయం నుంచి బయటికొచ్చేశారు.