(ఆగస్టు 21తో సీతాకోకచిలకకు 40 ఏళ్ళుపూర్తి)చివరిదాకా నిబద్ధతతో తాము నమ్ముకున్న విలువలకు కట్టుబడి చిత్రాలు నిర్మించిన అరుదైన నిర్మాతలు ఉన్నారు. అలాంటి వారిలో పూర్ణోదయా మూవీస్ అధినేత ఏడిద నాగేశ్వరరావు ఒకరు. తాను నిర్మించిన చిత్రాలలోనూ, నిర్మాణసారథిగా వ్యవహరించిన సినిమాల్లోనూ సంగీతసాహిత్యాలకు, కథ,కథనానికి పెద్ద పీట వేస్తూ సాగారు ఏడిద నాగేశ్వరరావు. ఎక్కడా రాజీపడకుండా, టాప్ స్టార్ కాల్ షీట్స్ లభించినా తన పంథాలోనే సాగారు తప్ప ఏ నాడూ తాను నమ్మిన విలువలకు తిలోదకాలు ఇవ్వలేదాయన.…