నాలుగు పదుల సీతాకోకచిలక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(ఆగస్టు 21తో సీతాకోకచిలకకు 40 ఏళ్ళుపూర్తి)
చివరిదాకా నిబద్ధతతో తాము నమ్ముకున్న విలువలకు కట్టుబడి చిత్రాలు నిర్మించిన అరుదైన నిర్మాతలు ఉన్నారు. అలాంటి వారిలో పూర్ణోదయా మూవీస్ అధినేత ఏడిద నాగేశ్వరరావు ఒకరు. తాను నిర్మించిన చిత్రాలలోనూ, నిర్మాణసారథిగా వ్యవహరించిన సినిమాల్లోనూ సంగీతసాహిత్యాలకు, కథ,కథనానికి పెద్ద పీట వేస్తూ సాగారు ఏడిద నాగేశ్వరరావు. ఎక్కడా రాజీపడకుండా, టాప్ స్టార్ కాల్ షీట్స్ లభించినా తన పంథాలోనే సాగారు తప్ప ఏ నాడూ తాను నమ్మిన విలువలకు తిలోదకాలు ఇవ్వలేదాయన. ఒకే ఒక్క శంకరాభరణం చిత్రం తీసి నిర్మాతగా తన అభిరుచిని లోకానికి చాటారు ఏడిద. అప్పటి నుంచీ పూర్ణోదయా మూవీస్ సంస్థ నుండి వచ్చే చిత్రాల కోసం జనం సైతం ఆసక్తిగా ఎదురుచూసేవారు. నలభై ఏళ్ళ క్రితం యువతను విశేషంగా ఆకట్టుకొనేలా ఏడిద నిర్మించిన చిత్రం సీతాకోకచిలక. భారతీరాజా దర్శకత్వంలో పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ద్వారా కార్తీక్ మురళి పేరుతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ముచ్చెర్ల అరుణ నాయికగా ఈ చిత్రం ద్వారానే పరిచయమై అలరించారు. ఇక ఇళయరాజా స్వరకల్పన, వేటూరి పదరచన ఈ చిత్రాన్ని మరింత హృద్యంగా మలిచేలా చేశాయి. ఈ నాటికీ ఈ చిత్రంలోని పాటలు వీనులకు విందుచేస్తూనే ఉండడం విశేషం.
తమిళంలో భారతీరాజా తెరకెక్కించిన అలైగళ్ ఒయివత్తిలై చిత్రం ఈ సీతాకోకచిలకకు ఆధారం. ఆ సినిమా షూటింగ్ మొదలైన కొద్ది రోజులకే ఈ చిత్రం కూడా ఆరంభమయింది. ఇందులోని కథాంశం ఏడిద నాగేశ్వరరావుకు నచ్చడంతో దీనిని తెలుగులో రీమేక్ చేయాలని ఆశించారు. కథకు అనుగుణంగా చిత్రీకరణ కోసం కావలసిన అన్ని ఏర్పాట్లూ చేశారు. దాంతో తమిళం పూర్తి కాగానే సీతాకోకచిలక తెలుగునాట షూటింగ్ మొదలెట్టుకుంది. తమిళ చిత్రం 1981 జూలై 18న విడుదల కాగా, సీతాకోకచిలక అదే ఏడాది ఆగస్టు 21న జనం ముందు నిలచింది. తమిళ సినిమా ద్వారా ప్రముఖ నటి రాధ చిత్రసీమకు పరిచయమయ్యారు. తెలుగు చిత్రం ద్వారా ముచ్చెర్ల అరుణ వెలుగుచూశారు.
Also Read
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
- Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
- God of Masses Birthday Special : నటసింహం 'బంగారు బాలయ్య'.. బర్త్ డే స్పెషల్
- Bharathiraja Special : భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకులు 'భారతీరాజా'
కథ విషయానికి వస్తే – ఓ బ్రాహ్మణ అబ్బాయి, క్రిస్టియన్ అమ్మాయిని ప్రేమిస్తాడు. అందుకు ఆ అమ్మాయి అన్న అంగీకరించడు. పైగా ఆ ఊరిలో ఆ క్రిస్టియన్ ఆసామి పెద్దమనిషిగా చెలామణీ అవుతూ ఉంటాడు. అతనికి అడ్డు చెప్పే ధైర్యం ఎవరికీ ఉండదు. అలాంటి పరిస్థితుల్లో హీరో హీరోయిన్ లేచిపోవాలని ప్రయత్నిస్తారు. దీనిని అడ్డుకొనేందుకు వచ్చిన అమ్మాయి అన్నను అతను గౌరవించే క్రిస్టియన్ ఫాదర్ సైతం వారించి, ప్రేమకు కులమతాలు లేవని బోధిస్తారు. మతం కంటే మానవత్వం గొప్పదని చాటి చెబుతారు. చివరకు ప్రేమజంట సీతాకోక చిలకల్లా తాముకోరుకున్న ప్రపంచంలోకి వెళ్ళడంతో కథ సుఖాంతమవుతుంది. ప్రేమజంటగా కార్తిక్, అరుణ నటించగా, ఆమె అన్న డేవిడ్ పాత్రలో శరత్ బాబు అభినయించారు. మిగిలిన పాత్రల్లో సిల్క్ స్మిత, రాళ్ళపల్లి, జగ్గయ్య, డబ్బింగ్ జానకి, బాలనటునిగా ఆలీ కనిపించారు.
ఈ చిత్రానికి కథను మణివణ్ణన్ రాయగా, కె.బాబూరావు తెలుగులో సహకారం అందించారు. జంద్యాల మాటలు కథకు బలాన్ని చేకూర్చాయి. ఇక ఇళయరాజా, వేటూరి కాంబినేషన్ ప్రాణం పోసింది. ఇందులోని అన్ని పాటలూ విశేషంగా అలరించాయి. ముఖ్యంగా మాటే మంత్రమూ… మనసేబంధం… పాట ఈ నాటికీ ప్రేమపక్షులను ఆకర్షిస్తూనే ఉంది. పాడింది పాడింది పట్నాల కాకి… అనే పాట, మిన్నేటి సూరీడువచ్చెనమ్మా…, అలలు కలలు ఎగసి… వంటి పాటలు కూడా ఇప్పటికీ జనం మదిని దోచేస్తూనే ఉన్నాయి. ఈ చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కేంద్రప్రభుత్వ అవార్డును సొంతంచేసుకుంది. ఆ యేడాది ఉత్తమ చిత్రంగా బంగారు నందిని సొంతంచేసుకుంది. పది కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. ఆ తరువాత అనేక చిత్రాలు మతాంతర వివాహాల నేపథ్యంలో తెరకెక్కడానికి సీతాకోకచిలక ప్రేరణగా నిలచింది.
తాజావార్తలు
-
Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసు.. ఇద్దరు మహిళలు సహా నలుగురు అరెస్ట్!
-
Simon Harmer: 18 ఏళ్ల రికార్డు బద్దలు.. బౌలర్‌గా వచ్చి బ్యాటింగ్‌లో అదరగొట్టి..
-
Coolpad Cool X Wide: 50MP కెమెరా, 4600mAh బ్యాటరీతో కొత్త ఫోన్.. ప్రీ-ఆర్డర్లు ప్రారంభం!
-
Supreme Court: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల వివాదంపై సుప్రీంకు వైసీపీ.. నేడు సీజేఐ ధర్మాసనం విచారణ
-
Harmanpreet Kaur 91 Runs: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలనం.. స్మృతి మంధాన రికార్డు బద్దలు!
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!