నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీలక నేత పొన్నం ప్రభాకర్ స్పందించారు. బీజేపీ హయాంలో ఈడీ నోటిసులు కామన్ అయ్యాయని ఎద్దేవా చేశారు. ఒక్క కేసీఆర్ కు మాత్రమే ఇప్పటి వరకు ఈడీ నోటీసులు రాలేదని అన్నారు. కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడే బీజేపీ ఈడీ నోటీసులు ఇవ్వడం లేని ఆయన అన్నారు.…
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా తెలిపారు. సోనియా గాంధీని ఈనెల 8న హాజరు కావాలని కోరగా.. రాహుల్ గాంధీని అంతకన్నా ముందే జూన్ 5న హాజరు కావాల్సిందిగా కోరినట్లు తెలిసింది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఇద్దరికి ఈడీ సమన్లు జారీ చేసింది. సోనియా గాంధీ ఈడీ సమన్లకు కట్టుబడి ఉన్నారని…
మనీలాండరింగ్ , హవాలా కేసులో ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) దూకుడు పెంచింది. కోల్ కతాకు చెందిన కంపెనీకి హవాలా లావాదేవీలకు సంబంధించిన కేసులో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. దీనిపై ఆప్ పార్టీ భగ్గుమంది. కేంద్రం కావాలనే విపక్షాలను టార్గెట్ చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కావాలనే మా పార్టీకి చెందిన మంత్రులను అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తోంది. బీజేపీ ప్రభుత్వం కేంద్ర సంస్థలతో ప్రతిపక్షాలను బెదిరిస్తున్నాయని ఆరోపిస్తున్నారు.…
మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్‌ను అరెస్ట్ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. మంగళవారం 9 గంటల పాటు ప్రశ్నించిన తర్వాత .. పూజా సింఘాల్ బుధవారం మళ్లీ విచారణకు హాజరయ్యారు.. ఇక, ఆమెకు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలను సేకరించిన ఈడీ.. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసింది.. కాగా పూజా సింఘాల్.. ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్ర గనులశాఖ కార్యదర్శిగా ఉన్నారు.. కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడటంతోపాటు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉండీ అనుచరులుగా చలామణీ అవుతున్న వ్యక్తుల ఇళ్లలో నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఎజెన్సీ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. నిన్న ముంబై వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. మొత్తంగా 29 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ముంబైలోని నాగ్ పాడ, గోరేగావ్, బోరివళి, శాంటాక్రూజ్, ముంబ్రాలోని పలువురు దావూద్ ఇబ్రహీం అనుచరుల ఇళ్లలో సోదాలు చేశారు. హవాలా ఆపరేటర్స్, రియల్ ఎస్టేట్, డ్రగ్ ట్రాఫికర్స్ నేరాలకు పాల్పడుతూ… దావూద్…
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. చైనాకు చెందిన దిగ్గజ మొబైల్ కంపెనీ షియోమీకి షాక్‌ఇచ్చింది.. ఏకంగా రూ.5,551.27కోట్ల డిపాజిట్లను స్తంభింపజేసింది.. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈ నిర్ణయం తీసుకుంది ఈడీ.. చైనాకు చెందిన షియోమీ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన షియోమీ ఇండియా.. 2014 ఏడాది నుంచి భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తుంది.. కానీ, భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన ఏడాది నుంచే.. అంటే 2015 ఏడాది నుంచే ఆ కంపెనీ అక్రమంగా నిధులను ఇతర దేశాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి..…
సల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాడేజ్ కష్టాలు తీరలేదు. ఇటీవల ఆమెను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఓ కేసు విషయంలో సుదీర్ఘ సమయం విచారించింది. తాజాగా ఆమెకు చెందిన రూ. 7.27 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. రూ. 200 కోట్ల స్కామ్ లో సూత్రధారి అయిన సుకేశ్ చంద్రశేఖర్ ఇప్పటికే అరెస్ట్ అయ్యి ఊచలు లెక్కపెడుతున్నాడు. అతనితో సాన్నిహిత్యం ఉన్న శ్రీలంకకు చెందిన హీరోయిన్ జాక్విలిన్…
ఘన్ శ్యాందాస్ జెమ్స్ అండ్ జ్యువెల్స్ ఎండీ సంజయ్ అగర్వాల్ పై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. తప్పుడు పత్రాలతో సంజయ్ అగర్వాల్ బ్యాంకులను రూ.90కోట్ల మోసం చేసినట్లు ఈడీ వెల్లడించింది. సీబీఐ కేసుల ఆధారంగా మనీలాండరింగ్ విచారణను ఈడీ చేపట్టింది. బ్యాంకుల నుంచి మోసపూరితంగా పొందిన సొమ్ముతో నగల దుకాణాలు తెరిచారని ఈడీ పేర్కొంది. అంతేకాకుండా కుటంబ సభ్యుల పేరిట సంజయ్ అగర్వాల్ నాలుగు నగల దుకాణాలు తెరిచారని, సంజయ్ కుమార్ తప్పుడు పేరుతో…
శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. పాత్ర ఛాల్ భూ కుంభకోణంలో రౌత్ పాత్రపై గతంలో ఆరోపణలు వినిపించాయి. రూ. 1034 కోట్ల ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)పై విచారణకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మరియు అతని కుటుంబ సభ్యులకు చెందిన అలీబాగ్‌లోని ఎనిమిది ల్యాండ్ పార్సెల్‌లను అటాచ్ చేసింది. అంతేకాకుండా ముంబైలోని దాదర్‌లోని ఒక ఫ్లాట్‌ను తాత్కాలికంగా అటాచ్ చేసింది. పాత్ర ఛాల్ భూ…
మహారాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి అనీల్ దేశ్‌ముఖ్‌ను మనీలాండరింగ్ కేసులోఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న ముంబై కార్యాలయంలో 12 గంటలపాటు సుధీర్ఘంగా అనీల్ దేశ్‌ముఖ్‌ను అధికారులు ప్రశ్నించారు. ముంబైలో బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని సస్పెండ్ అయిన పోలీసు అధికారి సచిన్ వాజే ను ఆదేశించినట్టు ముంబై మాజీ పోలీసు అధికారి పరంబీర్ సింగ్ ఆరోపణలు చేశారు. దీంలో ఎన్పోర్స్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి అనీల్ దేశ్‌ముఖ్‌కు నోటీసులు…