మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో కీలక పరిణామాలు ఎదురవుతున్నాయి. సినిమాను తలపించే విధంగా ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. రెండు వర్గాలు విడిపోయిన శివసేన తమ పంతాలు నెగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎంపీ సంజయ్ రౌత్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్( ఈడీ) సమన్లు జారీ చేసింది. జూన్ 28న విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు కావడానికి, ప్రస్తుతం…
నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ నిమిత్తం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు వరుసగా నాలుగోసారి ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీని ఇప్పటి వరకు దాదాపు 30 గంటల పాటు ఈడీ విచారించింది. శుక్రవారమే విచారణకు రావాలని ఈడీ రాహుల్‌కు సమన్లు జారీ చేయగా.. మూడు రోజులు సమయం ఇవ్వాలని కోరారు. తన తల్లి సోనియా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఈ క్రమంలో 17న కాకుండా 20న విచారణకు…
నేషనల్ హెరాల్డ్ కేసులో నాలుగో విడత విచారణ నిమిత్తం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు చేపట్టనుంది. పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి తీవ్రనిరసనల మధ్య రాహుల్ గాంధీని జూన్ 13 నుంచి 15వరకు మూడు రోజుల పాటు ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. మరో సారి ఈ నెల 17న విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు…
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు కదంతొక్కాయి. తమ అగ్రనేతలనే లక్ష్యంగా చేసుకుంటారా అంటూ రగిలిపోతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు, కాంగ్రెస్ ఆందోళనలతో దేశమంతా అట్టుడికిపోయింది. రాహుల్ గాంధీ సుదీర్ఘ ఈడీ విచారణ…కొన్ని రోజుల్లో సోనియా గాంధీకి సైతం తప్పని దర్యాప్తు సంస్థల ప్రశ్నలు…ఈ పరిణామాలు, కాంగ్రెస్ నాయకుల్లో ఒక్కసారిగా కదలిక తెచ్చాయా? నిస్తేజంగా వున్న క్యాడర్ లో కదన కుతూహలం పెంచాయా? జాతీయ రాజకీయాల్లో ఎన్నడూలేనంతగా కుదుపు. దేశవ్యాప్తంగా పొలిటికల్ ప్రకంపనల దుమారం. అన్ని రాష్ట్రాల కాంగ్రెస్…
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో రాహుల్ గాంధీని మూడు రోజులుగా ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) విచారిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలుపుతున్నాయి. ఢిల్లీలో ఈడీ ఆఫీస్ ముందే కాంగ్రెస్ అగ్రనేతలు నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన, ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా రాహుల్ గాంధీ ఈడీ విచారణపై తెలంగాణ కాంగ్రెస్ రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. గురువారం…
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని గత రెండు రోజుల పాటు విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. వరుసగా మూడో రోజూ విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో ఇవాళ కూడా ఆయన ఈడీ ఎదుట హాజరయ్యారు. గత రెండు రోజుల్లో దాదాపు 21 గంటల పాటు రాహుల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. రాహుల్ఈడీ విచారణ నేపథ్యంలో కాంగ్రెస్ ఆందోళనలు ఉద్ధృతంగా మారాయి. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద రాహుల్ గాంధీ స్టేట్మెంట్ను ఈడీ అధికారులు రికార్డు…
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీకి నోటీసులు పంపించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. అందులో భాగంగా ఇవాళ ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు రాహుల్ గాంధీ.. ముగ్గురు అధికారుల ఈడీ బృందం రాహుల్‌ను ప్రశ్నించింది.. నేషనల్ హెరాల్డ్‌తో సంబంధాలు, ఏజేఎల్‌లో ఉన్న స్థానం, యంగ్ ఇండియాలో పాత్రపై రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలుస్తుండగా.. ఆయన మాత్రం తనకు తెలియదని సమాధానం ఇచ్చినట్టుగా సమాచారం.. అయితే,…
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యేందుకు సిద్ధం అయ్యారు.. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు జారీ చేయగా.. ఇవాళ ఈడీ ముందుకు వెళ్లనున్నారు రాహుల్ గాంధీ.. ఇదే సమయంలో సత్యమేవ జయతే అంటూ భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ.. దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట ఆందోళనలకు పిలుపునిచ్చారు.. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమ…