షనల్ హెరాల్డ్ కేసుపై ఇవాళ ఈడీ ముందుకు గీతా రెడ్డి హాజరుకానున్నారు. ఆమెను ఈడీ ప్రశ్నించనున్నారు. ఇప్పటికే షబ్బీర్ అలీని ఈడీ ప్రశ్నించింది. ఎల్లుండి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని ఈడీ ప్రశ్నించనుంచి.
ఇవాళ మూడోరోజు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి ఈడీ ముందుకు హాజరు కానున్నారు. మొదటి రోజు 8 గంటలు, రెండో రోజు 10 గంటలపాటు విచారించిన ఈడీ. విదేశీ టూర్లపై ఈడీకి ఎమ్మెల్యే స్టేట్ మెంట్ ఇచ్చారు.
PFI conspiracy to make India an Islamic country: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ), ఈ సంస్థ నాయకుల ఇళ్లపై రెండు రోజుల క్రితం దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఎన్ఐఏ, ఈడీలు సోదాలు నిర్వహించి 106 మంది కీలక సభ్యులను అదుపులోకి తీసుకుంది. అయితే తాజాగా ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 10 మంది రిమాండ్ రిపోర్టులో ఎన్ఐఏ కోర్టుకు పలు విషయాలను తెలియజేసింది. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని.. ప్రముఖ నాయకులను…
Demands to ban PFI: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా( పీఎఫ్ఐ) తీవ్రవాద సంబంధిత కార్యకలాపాలకు, మనీలాండరింగ్ కు పాల్పడుతుందని ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ( ఎన్ఐఏ), ఈడీలు సంయుక్తంగా 15 రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిపాయి. 100కు పైగా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ‘ ఆపరేషన్ ఆక్టోపస్’ పేరుతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే భారత వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్న పీఎఫ్ఐని నిషేధించాలని పలు వర్గాల నుంచి డిమాండ్లు మొదలయ్యాయి.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో దర్యాప్తు ఏజెన్సీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. హైదరాబాద్ కేంద్రంగా లిక్కర్ స్కామ్ డొంక కదులుతోంది. ఈ స్కామ్ లో ముడపుల విషయంలో ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. లిక్కర్ స్కాం కేసులో ఉన్న కంపెనీలకు హైదరాబాద్ కంపెనీల నుండి భారీగా ముడుపులు వెళ్లినట్లు ఆధారాలు ఉన్నాయి. శ్రీనివాసరావుకు చెందిన పలు కంపెనీల నుంచే ముడుపులు వెళ్లినట్లు ఆధారాలను ఈడీ గుర్తించినట్లు సమాచారం. ఈ లిక్కర్ స్కామ్ కేసులో…
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. సుఖేశ్ చంద్రశేఖర్ మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న 200 కోట్ల రూపాయల దోపిడీ కేసులో... సమన్లు ఇచ్చారు.
రాష్ట్ర గవర్నర్ తమిలిసై తను రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నాననే మర్చిపోయారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకురాలి పాత్ర పోషిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలచే ఎన్నుకోబడిన కేసీఆర్ ను కేంద్రంచే నియమించబడిన గవర్నర్ ఎలా విమర్శిస్తుంది..? అని ప్రశ్నించారు. మోడీ ఏది చెప్తే గవర్నర్ అదే మాట్లాడుతున్నారని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలను కూలదోస్తున్నారన్నారు. పార్టీలకు అతీతంగా ఉండాల్సిన గవర్నర్ రాజ్ భవన్ లో…
రాష్ట్రంలో పథకం ప్రకారం కుట్ర చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కర్నాటకలో ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు జరగవు?. సీబీఐ నోటీసులు ఇస్తుందని బీజేపీ ఎంపీలకు ఎలా తెలుసు? అని మంత్రి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పరిపాలన వదిలి ప్రతిపక్షాలను వేధిస్తోందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. 8 రాష్టాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వలను పడగొట్టి దొడ్డిదారిన ప్రభుత్వం ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కేంద్రం పరిపాలన మర్చిపోయిందని అన్నారు. సీబీఐ నోటీసులు ఇస్తుంది అని బీజేపీ ఎంపీ…