ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సహా ఆయన సన్నిహితుల ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహిస్తోంది. టెండర్ స్కామ్ వ్యవహారంలో సీఎం, సహా ఆయన సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు చేపట్టింది. సాహెబ్గంజ్, బెర్హత్, రాజ్మహల్ సహా మొత్తం 18 ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఈడీ సోదాలు చేస్తోంది.
Anand Sharma: బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత!
సోరెన్ ప్రతినిధి పంకజ్ మిశ్రా నివాసంలోనూ కేంద్ర సంస్థ విస్తృత సోదాలు చేపడుతోంది. దాడుల సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పారామిలిటరీ బలగాల సాయం తీసుకుంది.