అనంతపురం జిల్లాలో ఈడీ అధికారుల సోదాలు కలకలం సృష్టించాయి.. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ (ఈడీ) అధికారులు శుక్రవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించారు. తాడిపత్రితో పాటు హైదరాబాద్‌లోని జేసీ సోదరుల నివాసాల్లో ఏకకాలం దాడుల నిర్వహించారు ఈడీ అధికారులు.. ఇదే సమయంలో జేసీ సోదరుల ముఖ్య అనుచరుడిగా ఉన్న కాంట్రాక్టర్ గోపాల్‌రెడ్డి నివాసంలోనూ సోదాలు జరిగాయి.. ఈ సోదాల నేపథ్యంలో వారి…