Baby Growing In Bowel: ఫ్రాన్స్ దేశంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ కడుపు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లింది. మహిళ పరిస్థితి తెలుసుకున్న డాక్టర్లతో పాటు నిజం తెలిసి సదరు మహిళ కూడా ఒక్కసారిగా కంగుతింది. 37 ఏళ్ల మహిళ తనకు తెలియకుండానే 23 వారాల గర్భవతి అని తేలింది. అయితే బిడ్డ పేగులో పెరుగుతున్నాడనే వార్త తెలిసి అంతా షాక్‌కి గురయ్యారు.
గర్భధారణ అనే ప్రక్రియ.. అండంతో శుక్రకణం కలి శాక, అది పిండంగా ఏర్పడ్డ సమయం నుంచి మొదల వుతుంది. అండంతో శుక్రకణం కలవడాన్ని ‘ఫలదీక రణ’ అంటారు, ఫలదీకరణ జరిగాక ఏర్పడ్డ పిండం గర్భసంచిలో పెరగాలి. కానీ, కొన్ని సందర్భాల్లో గర్భ సంచిలో కాకుండా.. దాని పరిసరాల్లో పిండం పెరగడాన్ని ‘ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ’ అంటారు. అండాశయం (ఓవరీస్) నుంచి అండాన్ని గర్భసంచి లోకి వచ్చేలా తోడ్పడే ట్యూబ్ను ‘ఫెలోపియన్ ట్యూబ్స్’ అంటారు. కొన్ని సందర్భాల్లో పిండు గర్భ…