మోడీ 3.0 సర్కార్ తొలిసారి పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. మిత్రపక్షాల సపోర్టుతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఈ బడ్జెట్‌పై అన్ని రాష్ట్రాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి.
PM Modi: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 బడ్జెట్‌ను జులై 23వ తేదీన లోక్‌సభలో ప్రవేశ పెట్టనుంది. అంతకంటే ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బడ్జెట్‌కు సంబంధించి అభిప్రాయాలు, సూచనలను సేకరించేందుకు ప్రముఖ ఆర్థికవేత్తలతో రేపు (గురువారం) భేటీ అవుతారని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.