పప్పు ఆరోగ్యానికి మంచిది.. శాకాహారం తీసుకొనే వారికి ఇది మాంసంలోని పోషకాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పప్పుల్లో పొటాషియం, ఫైబర్, విటమిన్ బి, ఇనుము వంటివి పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా.. పప్పులలో ఉండే ఫైబర్ ఆరోగ్యానికి వరంగా భావిస్తారు. అయితే వర్షాకాలంలో కొన్ని పప్పులు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.