Tamil Nadu: సమ్మర్ హాలిడేస్ రావడం, ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు కుటుంబం, ఫ్రెండ్స్‌తో ఊటీ, కొడైకెనాల్ వెళ్తామనుకుంటున్న వారికి తమిళనాడు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ రెండు ప్రాంతాల్లో ఈ-పాస్ విధానం అమలు చేయడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక నుంచి వెళ్లిన పర్యాటకులకు ఈ -పాస్ విధానం గురించి తెలియక చిక్కుకుపోయారు. మరోవైపు, ఈ విధానంపై స్థానిక వ్యాపారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. కంట్రోల్ చేయడానికి అనేక ఆంక్షలు, నిబంధనలు అమలు చేస్తున్నా కట్టడి కావడం లేదు. ఇక ఇదిలా ఉంటె, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే లాక్ డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత ఈ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఏపీ నుంచి తెలంగాణలోకి ఎంటర్ కావాలంటే ఈ పాస్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. అత్యవసర, అంబులెన్స్ ను మినహాయించి మిగతా వాటికీ ఈ పాస్ లు…