నా ప్రాణం పోయినా ఈ ఇల్లు విడిపెట్టేది లేదంటున్నారు దువ్వాడ వాణి.. ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేస్తున్నారు వాణి, కుమార్తె హైందవి.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన వాణి.. కేసు కోర్టులో ఉంది.. మాకు ఆర్డర్ కూడా వచ్చింది.. ఇంటిలో ప్రవేశానికి కోర్టు అనుమతి ఇచ్చిందన్నారు.. కోర్టు ఆదేశాలు ఉండగా.. మాధురి చేసుకున్న రిజిస్ట్రేషన్ చెల్లదు అంటున్నారు.. ఇది కోర్టు ధిక్కారం కిందకి వస్తుందంటున్నారు.. ఇక, మా ఆస్తి తీసుకొని,…
వివాదాస్పదంగా మారిన ఆ ప్రాపర్టీ నాదే అంటూ ఓ వీడియో విడుదల చేశారు దివ్వెల మాధురి.. ఈ బిల్డింగ్ నా పేరు మీద ఉంది.. నా ఇంటిలోకి ఎవరూ రావడానికి వీలులేదని స్పష్టం చేశారు.. అంతేకాదు.. దువ్వాడ శ్రీనివాస్‌తో ఏమైనా ఇష్యూ ఉంటే వాణి బైట తేల్చుకోవాలంటూ సలహా ఇచ్చారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారంలో మరో ట్విస్ట్ నెలకొంది. దువ్వాడ వివాదాస్పద ఇంటిలోకి వెళ్లేందుకు గత కొంత కాలంగా ఆయన భార్య దువ్వాడ వాణి, కుమార్తెలు యత్నిస్తున్నారు.. అంతేకాదు.. అక్కడే మకాం పెట్టారు.. గత నెల రోజుల నుంచి ఇంటి బయటే ఆందోళన నిర్వహిస్తూ వస్తున్నారు.. అయితే, ఆ ఇంటిలోకి ఈ రోజు దివ్వెల మాధురి ఎంట్రీ ఇచ్చింది..