ఇవాళ్టి నుంచి దసరా ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై ప్రారంభం అయ్యాయి. ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు.
శ్రీశైలంలో ఈనెల 15 నుంచి 24 వరకు దసరా దేవి శరన్నవరాత్రులు జరగనున్నాయి. దసరాకు వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, వసతి కల్పిస్తామని శ్రీశైలం ఆలయ ఈవో వెల్లడించారు.
ఈ నెల 15 నుంచి ఇంద్రకీలాద్రిపై ప్రారంభం కానున్న దసరా ఉత్సవాల ఏర్పాట్ల పై అధికారులు సమీక్షించారు. ఈ సమీక్షలో ఎండోమెంట్ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, సీపీ కాంతిరాణా టాటా, డీసీపీ విశాల్ గున్ని, వీఎంసీ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్, ఈఓ భ్రమరాంబ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
దసరా మహోత్సవాలకు సిద్ధమవుతోంది ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం… దసరా మహోత్సవాల నిర్వహణపై ఇవాళ శ్రీశైలంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఆలయ అధికారులు.. అక్టోబర్ 7 నుండి 15 వరకు దసరా మహోత్సవాలు నిర్వహించనున్నట్టు సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత వెల్లడించారు శ్రీశైలం ఆలయం ఈవో లవన్న.. ఈ సమయంలో వివిధ అలంకారాలలో భక్తులకు దర్శనమివనున్నారు శ్రీశైల భ్రమరాంబికా దేవి.. కోవిడ్ నిబంధనలతో శ్రీ స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం రద్దు చేసినట్టు లవన్న వెల్లడించారు.. గ్రామోత్సవం రద్దు దృష్ట్యా…