అమరావతి రాజధాని కేసులపై హైకోర్టులో విచారణ ప్రారంభం అయింది. రాజధాని కేసుల నుంచి న్యాయమూర్తులు సత్యనారాయణ మూర్తి, సోమయాజులను తప్పించాలని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే పిటిషన్ వేశారు. రాజధానిలో ఆ ఇద్దరు న్యాయమూర్తులకు భూములున్నాయని.. వారిని ధర్మాసనం తప్పించాలని కోరారు దుష్యంత్ దవే. గతంలో ఇవే పిటిషన్లపై విచారణ చేపడుతోన్నప్పుడు ఎందుకు అభ్యంతరం తెలపలేదని హైకోర్టు ప్రశ్నించింది. న్యాయమూర్తులపై ప్రభుత్వ అభ్యంతర పిటిషన్‌ని కొట్టేసింది హైకోర్టు. తాము అభ్యంతరం తెలిపామనే విషయాన్ని తీర్పులో ప్రస్తావించాలని…