మహిళల్లో చాలా మందికి నెల వారీ రుతుక్రమం సమయంలో నొప్పి వస్తుంది. సాధారణంగా ఈ నొప్పి పొత్తికడుపు కండరాలు పట్టేసినట్లుగా ఉంటుంది. ఆ నొప్పి అక్కడి నుంచి వీపు మీదకు, తొడలకు, కాళ్లకు, శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించవచ్చు. పీరియడ్ సమయంలో ఈ నొప్పి ఓ మాదిరిగా, హెచ్చుతగ్గులు లేకుండా ఉండవచ్చు.