దేశంలో మాదకద్రవ్యాల సరఫరాపై కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. అనుమానం వచ్చిన ప్రతిచోట తనిఖీలు చేపట్టి మాదకద్రవ్యాల స్మగ్లర్లకు చెక్ పెడుతున్నారు. అయితే తాజాగా గుజురాత్ తీరంలో భారీగా హెరాయిన్ పట్టుబడటం కలకలం రేపుతోంది. భారత రక్షణ దళం, గుజరాత్ ఏటీఎస్ సంయుక్తంగా గుజరాత్ తీరంలో ఆపరేషన్ నిర్వహించాయి. దీంతో భారత జలాల్లో పాకిస్తాన్‌కు చెందిన ఫిషింగ్ బోట్‌ను అధికారులు సీజ్ చేశారు. బోట్‌లో రూ.400 కోట్లు విలువ చేసే 77…
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి, డ్రగ్స్ కేసులు కలకలం రేపుతున్నాయి. మేడ్చల్ జిల్లాలో భారీగా మెపిడ్రెన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రూ. రెండు కోట్ల విలువగల డ్రగ్ స్వాధీనం చేసుకోవడంతో నగరం ఉలిక్కిపడింది. 4.92 కేజిలతో పాటు, ఓ కార్ సీజ్ చేశారు పోలీసులు. ముగ్గురు నిందితులు పవన్,మహేష్ రెడ్డి,రామకృష్ణగౌడ్ ను అరెస్ట్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ప్రధాన నిందితులు ఎస్క్ రెడ్డి, హన్మంత్ రెడ్డి పరారీలో ఉన్నట్టు పోలీసులు…