Durga Devi as Saraswati: శ్రీ పంచమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తోంది. ఈ ప్రత్యేక అలంకరణను తిలకించేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు, చిన్నారులతో దుర్గగుడి ప్రాంగణం కిటకిటలాడుతోంది. ఉదయం 4 గంటల నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో నిలుస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 18 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. వేలాది మంది భక్తులు ఇప్పటికే ఆలయానికి…