దేశంలో సైబర్ మోసాల కేసులు గణనీయంగా పెరిగాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నంద్ గోపాల్ గుప్తా నంది సైబర్ మోసానికి గురయ్యారు. సైబర్ నేరగాళ్లు రూ.2 కోట్ల 8 లక్షలు మోసం చేశారు. మంత్రి నంది కుమారుడి పేరుతో సైబర్ దుండగులు అకౌంటెంట్‌ను ట్రాప్ చేసి మోసానికి పాల్పడ్డారు. మోసానికి గురైనట్లు తెలుసుకున్న వెంటనే సైబర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.